బదిలీలు, పదోన్నతుల వ్యవహారంలో అవినీతి ఆరోపణలు.. ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
నిత్యం నిఘా,బ్యూరో వరంగల్:..
బదిలీలు, పదోన్నతుల వ్యవహారంలో అవినీతి ఆరోపణలు.. ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
డీజీపీ ఆదేశాలతో ప్రాథమిక విచారణ.. డీఐజీ కార్యాలయంలో కలకలం
వరంగల్‌లోని డీఐజీ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. కార్యాలయ సూపరింటెండెంట్ యుగంధర్, సీనియర్ అసిస్టెంట్ మధుసూదన్‌లను సస్పెండ్ చేసినట్లు సమాచారం.
బదిలీలు, పదోన్నతులు, శిక్షా చర్యలకు సంబంధించిన వ్యవహారాల్లో అవినీతికి పాల్పడుతున్నారంటూ బాధితులు డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదుపై స్పందించిన డీజీపీ విచారణకు ఆదేశించారు.
డీజీపీ ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్, భద్రాద్రి జోన్ డీఐజీ శ్వేత ప్రాథమిక విచారణ చేపట్టినట్లు సమాచారం. విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా గురువారం రాత్రి ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.
ఈ ఘటన పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగులపై వచ్చిన ఆరోపణలపై తదుపరి విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.