🏠 Home
Watermark

NITYAM NIGHA

Reporter
Reporter
Scan to Read Scan to Read

బతుకమ్మ, దసరా పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి

Main Image
నిత్యం నిఘా,ఎల్కతుర్తి ప్రతినిధి:.

రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలి

ఎల్కతుర్తి సీఐ శ్రీను

బతుకమ్మ, దసరా పండుగలను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎల్కతుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీను సూచించారు. పండుగల సందర్భంగా మహిళలకు, ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

సద్దుల బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో అమ్మవారి మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణించకూడదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని స్పష్టం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉంటూ రహదారి భద్రతా నియమాలను పాటించాలని కోరారు. తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

పండుగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని సీఐ శ్రీను కోరారు. మహిళలు, యువతులు పండుగ వేడుకల్లో పాల్గొనే సమయంలో బంగారు ఆభరణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్‌తో పాటు సర్కిల్ పరిధిలోని వంగర, భీమదేవరపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో నివసించే ప్రజలందరూ పోలీసుల సూచనలు పాటిస్తూ పండుగలను సురక్షితంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ప్రజలందరికీ బొడ్డెమ్మ, బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి పండుగలను సంతోషంగా, సురక్షితంగా జరుపుకోవాలని సీఐ శ్రీను కోరారు.
🏠 Home