బావుపేట్‌లో విషాదం.. రైలు ఢీకొని సర్పంచ్ పెద్ద కుమారుడు మృతి
నిత్యం నిఘా,ఎల్కతుర్తి(హన్మకొండ ):
బావుపేట్‌లో విషాదం.. రైలు ఢీకొని సర్పంచ్ పెద్ద కుమారుడు మృతి
రైల్వే ట్రాక్‌పై అరవింద్ మృతదేహం.. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం బావుపేట్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ బత్తిని రవీందర్ పెద్ద కుమారుడు బత్తిని అరవింద్ రైలు ఢీకొని మృతి చెందాడు. గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అరవింద్ మృతికి దారితీసిన పరిస్థితులు, ఘటనకు గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సర్పంచ్ బత్తిని రవీందర్ పెద్ద కుమారుడు అరవింద్ మృతితో బావుపేట్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.