మిల్లర్ల ‌ను నష్టాల్లోకి నెట్టి రైతుకు న్యాయం చేయలేరు!

నిత్యం నిఘా,బ్యూరో:… ప్రభుత్వ నిబంధనల భారాన్ని మిల్లర్లపై మోపితే.. చివరకు రైతుపైనే ప్రభావం మిల్లింగ్ రికవరీ, నాన్‌-ఎఫ్‌ఏక్యూ ధాన్యం, సీఎంఆర్‌ స్వీకరణ జాప్యంపై ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ప్రభుత్వ నిబంధనల అమలులో క్షేత్రస్థాయి వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా మిల్లర్లపై ఆర్థిక భారాన్ని మోపితే, దాని ప్రభావం చివరకు రైతుపైనే పడుతుందని ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ కుమార్ అన్నారు. రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లులకు తరలించడం, మిల్లింగ్ అనంతరం ప్రభుత్వానికి సీఎంఆర్‌ బియ్యం అందించడం వరకు మొత్తం ప్రక్రియలో ప్రతి దశలో సమన్వయం అవసరమని పేర్కొన్నారు. ములుగు జిల్లా...