బతుకమ్మ, దసరా పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి
నిత్యం నిఘా,ఎల్కతుర్తి ప్రతినిధి:. రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఎల్కతుర్తి సీఐ శ్రీను బతుకమ్మ, దసరా పండుగలను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీను సూచించారు. పండుగల సందర్భంగా మహిళలకు, ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో అమ్మవారి మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణించకూడదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని స్పష్టం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉంటూ రహదారి భద్రతా నియమాలను పాటించాలని కోరారు. తమ ప్రాణాలతో పాటు...