దానవాయిపేటలో వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
నిత్యం నిఘా,చర్ల (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): సంప్రదాయ గిరిజన నృత్యాలు, బతుకమ్మ పాటలతో సందడిగా సంబరాలు చర్ల మండల పరిధిలోని దానవాయిపేట గ్రామంలో సమ్మక్క–సారలమ్మ బతుకమ్మ కమిటీ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రామానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. మహిళలు ప్రదర్శించిన సంప్రదాయ గిరిజన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి, బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మహిళలు ఒకరికొకరు వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటూ సద్దుల...