సైకిల్ ర్యాలీలో సత్తా చాటిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రమేష్

నిత్యం నిఘా,వరంగల్ పోలీస్ కమిషనరేట్: సైకిల్ ర్యాలీలో సత్తా చాటిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రమేష్ 24 నిమిషాల్లో 10 కిలోమీటర్లు పూర్తి.. పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా రజత పతకం అందజేత పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 6.30 గంటలకు హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి ఫాతిమా నగర్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హనుమకొండ ట్రాఫిక్ కానిస్టేబుల్ గంగాధరి రమేష్ తన ప్రతిభను చాటుకున్నారు. కేవలం 24 నిమిషాల్లో 10 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసి రజత పతకాన్ని సాధించారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా కానిస్టేబుల్ రమేష్ రజత పతకాన్ని అందుకున్నారు....