ఆహార తయారీ కేంద్రాలపై అధికారుల కొరడా!

నిత్యం నిఘా,వరంగల్ ట్రై సిటీ: ఆహార తయారీ కేంద్రాలపై అధికారుల కొరడా! 9 కేంద్రాల లైసెన్సులు సస్పెండ్‌.. పలు యూనిట్లు మూసివేత స్వీట్లలో ఫేషియల్‌ రోజ్‌వాటర్‌ వినియోగం.. చనిపోయిన దోమలతో చక్కెర పాకం 5,045 కిలోల అనుమానాస్పద ముడి సరుకులు స్వాధీనం ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడమే లక్ష్యంగా వరంగల్‌, హనుమకొండ జిల్లాల పరిధిలోని పలు ఆహార తయారీ కేంద్రాలపై తెలంగాణ ఆహార భద్రత విభాగం అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తీవ్రమైన అపరిశుభ్రత, నాణ్యతా లోపాలు, నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి. దీంతో తొమ్మిది తయారీ కేంద్రాల ఆహార భద్రత లైసెన్సులను సస్పెండ్‌ చేయడంతో పాటు, పలు యూనిట్ల కార్యకలాపాలను నిలిపివేశారు....