చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో అర్ధరాత్రి డ్రగ్స్‌ పార్టీ కలకలం!

నిత్యం నిఘా, బ్యూరో (హైదరాబాద్): చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో అర్ధరాత్రి డ్రగ్స్‌ పార్టీ కలకలం! 108 మంది విద్యార్థులు పోలీసుల అదుపులో.. నలుగురికి గంజాయి పాజిటివ్‌ 7 కార్లు, 3 ద్విచక్ర వాహనాలు, 70 సెల్‌ఫోన్లు స్వాధీనం హైదరాబాద్‌ శివారులోని చేవెళ్ల ప్రాంతంలో అర్ధరాత్రి నిర్వహించిన ఫామ్‌హౌస్‌ పార్టీపై పోలీసులు మెరుపు దాడి చేయడంతో మాదకద్రవ్యాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ పార్టీలో పాల్గొన్న 108 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసుల తనిఖీల్లో నలుగురు విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో గంజాయి పాజిటివ్‌గా నిర్ధారణ కావడం తీవ్ర కలకలం రేపింది. ఫామ్‌హౌస్‌లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు గంజాయితో పాటు ఏడు కార్లు, మూడు ద్విచక్ర...