పోలీసు సంక్షేమ నిధుల్లో కోటి రూపాయల గోల్‌మాల్!

నిత్యం నిఘా,హైదరాబాద్: పోలీసు సంక్షేమ నిధుల్లో కోటి రూపాయల గోల్‌మాల్! రెండేళ్లుగా వడ్డీ సొమ్ము పక్కదారి? పేట్లబురుజు పోలీసు హెడ్‌క్వార్టర్స్ ఖాతాలో అక్రమాలు.. ఇద్దరి అరెస్ట్ పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం కేటాయించిన నిధులే పక్కదారి పట్టినట్లు ఆరోపణలు రావడం పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని పేట్లబురుజు పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు సంబంధించిన సంక్షేమ నిధుల ఖాతా నుంచి సుమారు కోటి రూపాయలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై చేపట్టిన విచారణలో వినయ్, మోసిన్ అనే ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా తేలడంతో పోలీసులు వారిని అరెస్టు చేసినట్లు సమాచారం. వడ్డీ సొమ్ము సొంత ఖాతాల్లోకి మళ్లింపు? గత రెండేళ్లుగా సంక్షేమ నిధులకు సంబంధించిన...