Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

విద్యుత్ షాక్‌తో రైతు దుర్మరణం

విద్యుత్ షాక్‌తో రైతు దుర్మరణం

నిత్యం నిఘా,చర్ల ప్రతినిధి(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా):

పొలానికి వెళ్తుండగా తెగిపడిన విద్యుత్ వైరు తగిలి మృతి

గతంలో కుమారుడు కూడా విద్యుత్ షాక్‌తో మృతి.. గ్రామంలో విషాదం

ఇవి కూడా చదవండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలో విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతి చెందాడు. సీకత్తిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని జీపీ పల్లి గ్రామానికి చెందిన పుచ్చా రమణారెడ్డి ఆదివారం ఉదయం తన పంట పొలానికి వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మార్గమధ్యంలో తెగిపడి ఉన్న విద్యుత్ వైరు తగలడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనను గమనించిన స్థానికులు రమణారెడ్డిని వెంటనే చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యుడు సాయివర్ధన్ ధ్రువీకరించారు.

ఇదిలా ఉండగా, గతంలో రమణారెడ్డి కుమారుడు కూడా విద్యుత్ షాక్‌తోనే మృతి చెందాడు. ఇప్పుడు తండ్రి సైతం అదే విధంగా ప్రాణాలు కోల్పోవడంతో జీపీ పల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో తండ్రీకొడుకులు విద్యుత్ ప్రమాదాలకు బలికావడంతో గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.