Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఉర్సు బైపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రియల్ ఎస్టేట్ వ్యాపారి మృతి

Author NITYAM NIGHA | 26 Oct 2026, 09:19 AM | క్రైం న్యూస్, వరంగల్
ఉర్సు బైపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రియల్ ఎస్టేట్ వ్యాపారి మృతి

నిత్యం నిఘా,వరంగల్:

ఉర్సు బైపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రియల్ ఎస్టేట్ వ్యాపారి మృతి

ఉర్సు బైపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రియల్ ఎస్టేట్ వ్యాపారి మృతి - Additional Image

తాళ్ల పద్మావతి కళాశాల సమీపంలో బైక్‌ను ఢీకొన్న లారీ.. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు

ఇవి కూడా చదవండి

వరంగల్ నగరంలోని ఉర్సు బైపాస్‌లో తాళ్ల పద్మావతి కళాశాల సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఉర్సుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆవునూరి రాజు మృతి చెందారు. స్థానికులకు సుపరిచితుడైన రాజు మృతితో ఉర్సు ప్రాంతంలో విషాదం నెలకొంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.