Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు

Author NITYAM NIGHA | 13 Sep 2026, 04:35 PM | Politics, TELANGANA, వరంగల్
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు

నిత్యం నిఘా,బ్యూరో (వరంగల్/సంగెం):..


— ప్రమాదంలో గాయపడిన యువకుడికి పరామర్శ.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు - Additional Image

సంగెం మండలం నార్లవాయి గ్రామ బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు బూర ప్రకాష్ తండ్రి బూర నర్సయ్య శనివారం సాయంత్రం మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు ఆదివారం నార్లవాయిలోని మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, నర్సయ్య మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

ఇవి కూడా చదవండి

అనంతరం ఇటీవల ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద చికిత్స పొందుతున్న కాగితాల నాగరాజును నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు పరామర్శించారు. నాగరాజు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చికిత్సకు అవసరమైన సహకారం అందించేందుకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు సారంగపాణి, వేల్పుల కుమారస్వామి, బుక్క మల్లయ్య, నార్లవాయి గ్రామ సర్పంచ్ సింగిరెడ్డి అనిల్‌రాజ్, మాజీ సర్పంచ్ సింగిరెడ్డి కుమారస్వామి, మాజీ ఉపసర్పంచ్ మాదినేని కోటి, మాదినేని రాజు, దామర కిషోర్, దామెర నవీన్, సింగిరెడ్డి విష్ణు, రొట్టె చిన్న అనిల్, పెండ్లి పురుషోత్తంరెడ్డి తదితర మండల బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు పాల్గొన్నారు.