Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అంబేద్కర్ సంఘం చింతలపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా చిలుముల ప్రమోద్ ఏకగ్రీవ ఎన్నిక

Author NITYAM NIGHA | 26 Oct 2026, 09:09 AM | హన్మకొండ
అంబేద్కర్ సంఘం చింతలపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా చిలుముల ప్రమోద్ ఏకగ్రీవ ఎన్నిక

నిత్యం నిఘా,ఎల్కతుర్తి (హన్మకొండ):

అంబేద్కర్ సంఘం చింతలపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా చిలుముల ప్రమోద్ ఏకగ్రీవ ఎన్నిక

అంబేద్కర్ సంఘం చింతలపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా చిలుముల ప్రమోద్ ఏకగ్రీవ ఎన్నిక - Additional Image

విద్య, ఐక్యత, రాజకీయ చైతన్యంతోనే సమాజాభివృద్ధి సాధ్యం

ఇవి కూడా చదవండి

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం నూతన గ్రామ శాఖ కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా చిలుముల ప్రమోద్ ఎన్నికయ్యారు. తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెలమకంటి దయాకర్ సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తూముల సదానందం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొర్రె థామస్, మండల అధ్యక్షుడు బొంకూరి రాజీవ్ గాంధీతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తూముల సదానందం మాట్లాడుతూ సమాజంలో సమూల మార్పు తీసుకురావడానికి విద్య పునాది అని, ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు ప్రతి ఒక్కరూ విద్యా, సామాజిక, రాజకీయ చైతన్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులు విద్యలో రాణిస్తూ అంబేద్కర్ ఆశయాలను అర్థం చేసుకోవాలని సూచించారు. విద్య ద్వారా తమ హక్కులపై అవగాహన పెంచుకొని, సమాజంలో నెలకొన్న అసమానతలు, వివక్షను ప్రశ్నించే చైతన్యాన్ని పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. బహుజన వర్గాల ప్రజలు ఓటు విలువను గుర్తించి ఆలోచనాత్మకంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, రాజ్యాంగం, పౌర హక్కులు, సామాజిక బాధ్యతలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. యువత నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని, విద్య, ఐక్యత, రాజకీయ చైతన్యంతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని సదానందం పేర్కొన్నారు. అనంతరం మండల అధ్యక్షుడు బొంకూరి రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో నూతన గ్రామ శాఖ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా బొంకూరి ప్రశాంత్, ప్రధాన కార్యదర్శిగా బొంకూరి చందు, సహాయ కార్యదర్శులుగా చుంచు రాకేష్, చిలుముల అరుణ్, గౌరవ అధ్యక్షుడిగా బొంకూరి సదానందం, ముఖ్య సలహాదారుగా చిలుముల రమేష్ ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులకు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో అంబేద్కర్ ఆశయాల ప్రచారం, విద్యాభివృద్ధి, సామాజిక సమానత్వం, రాజ్యాంగ హక్కులపై అవగాహన కల్పించే కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ సంఘాన్ని బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బొంకూరి రవీందర్, అడ్డూరి రమేష్, అడ్డూరి ప్రశాంత్, చిలుముల వినోద్, గ్రామానికి చెందిన జర్నలిస్టులు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.