Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

వాగ్దేవి కళాశాలలో రక్తదాన శిబిరం.. 150 యూనిట్ల రక్తం సేకరణ

Author NITYAM NIGHA | 29 Oct 2026, 06:30 PM | వరంగల్
వాగ్దేవి కళాశాలలో రక్తదాన శిబిరం.. 150 యూనిట్ల రక్తం సేకరణ

నిత్యం నిఘా,వరంగల్ పోలీస్ కమిషనరేట్:

వాగ్దేవి కళాశాలలో రక్తదాన శిబిరం.. 150 యూనిట్ల రక్తం సేకరణ

వాగ్దేవి కళాశాలలో రక్తదాన శిబిరం.. 150 యూనిట్ల రక్తం సేకరణ - Additional Image

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కార్యక్రమం

శిబిరాన్ని ప్రారంభించిన తూర్పు జోన్‌ డీసీపీ అంకిత్‌ కుమార్‌

ఇవి కూడా చదవండి

వాగ్దేవి కళాశాలలో రక్తదాన శిబిరం.. 150 యూనిట్ల రక్తం సేకరణ - Additional Image

అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేత, ఐపీఎస్‌ మార్గదర్శకత్వంలో మామునూరు ఉపవిభాగం పోలీసులు, ఎంజీఎం ఆసుపత్రి వైద్యుల సహకారంతో బొల్లికుంటలోని వాగ్దేవి కళాశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 150 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.

వరంగల్‌ తూర్పు జోన్‌ డీసీపీ అంకిత్‌ కుమార్‌ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. రక్తదానం ప్రాణాలను కాపాడే గొప్ప మానవతా సేవ అని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి అండగా నిలిచేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు.

రక్తదాతలకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రతినిధులు పండ్లు, పండ్ల రసాలు, ఇతర అల్పాహార పదార్థాలను అందజేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదానంపై అవగాహన పెంపొందించుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు సూచించారు.

ఈ కార్యక్రమంలో మామునూరు ఏసీపీ ఎన్‌. వెంకటేష్‌, ఎంజీఎం ఆసుపత్రి వైద్య బృందం, వాగ్దేవి కళాశాల ఫార్మ్‌-డి ప్రిన్సిపాల్‌ కమల్‌ యాదవ్‌, మామునూరు, ఏనుమాముల, గీసుకొండ పోలీస్‌ స్టేషన్ల సీఐలు, సంగెం, పర్వతగిరి, ఏనుమాముల, మామునూరు ఎస్‌ఐలు, ఇతర పోలీసు సిబ్బంది, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.